నేడు మధ్యాహ్నం 1:45 గంటలకు నామినేషన్
ఆకుల లలితకు నిరాశ
సముచిత స్థానం కల్పిస్తామని అధిష్టానం హామీ?
కవిత రాజ్యసభకు వెళ్తారని భావించినా మారిన సమీకరణలు
చివరి వరకు ఉత్కంఠభరిత పరిణామాలు
నిజామాబాద్ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ టీఆర్‌ఎస్ అభ్యర్థి విషయంలో చివరివరకు కొనసాగి న ఉత్కంఠ వీడింది. సీఎం కేసీఆర్ తన య కల్వకుంట్ల కవిత మరోసారి బరి లోకి దిగుతున్నారు. ఆకుల లలితకు టిక్కెట్టు ఖాయమనుకున్నప్పటికీ చివరకు సిట్టింగ్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకే ఖరారైంది. టీఆర్‌ఎస్‌కు సింహభాగం ఓ ట్ల బలముండడంతో కవిత గెలుపు నల్లేరు మీద నడకే. అయితే ఈ స్థా నాన్ని ఆకుల లలితకు కేటాయిస్తారని తుదివరకు వార్తలు వచ్చాయి. లలిత పేరే చివరి వ రకు పరిశీలనలో ఉంది. కవిత రాజ్యసభకు వెళ్తారని రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరిగింది. చివ రకు కవితే ఖరారు కావడం గమనార్హం. రాష్ట్రంలో అన్ని జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయంలో ఆదివారమే ఒక స్పష్టత వచ్చినప్పటికీ నిజామాబాద్ విషయంలో మాత్రం మొదటి నుంచి చివరి వరకు ఉత్కంఠభరిత వాతావరణమే చోటుచేసుకుంటూ వచ్చింది. మంగళవారం మధ్యాహ్నం 1:45 గంటలకు కవిత నిజామాబాద్‌లో నామినేషన్ దాఖలు చేయనున్నట్లు సమాచారం. కవిత ఎన్నిక ఏకగ్రీవం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎమ్మెల్సీ అభ్యర్థిగా కవిత ఖరారుపై ఆమె అనుచర వర్గాల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
సురేష్‌రెడ్డి, బీబీ పాటిల్ హర్షం..
ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కల్వకుంట్ల కవిత పేరును ప్రకటించడంపై రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేష్‌రెడ్డి, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు వారు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కౌన్సిల్ సభ్యురాలిగా కవిత అద్భుతంగా పని చేశారని పేర్కొన్నారు. పార్టీ బలోపేతం విషయంలో ఆమెకు ఉన్న నిబద్ధత ఎనలేనిదని, మహానేత సీఎం కేసీఆర్ తీసుకున్న అద్భుతమైన నిర్ణయానికి పార్లమెంట్ సభ్యులుగా తాము స్వాగతిస్తున్నామని, కవితకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఎమ్మెల్యే కోటాలోనూ దక్కని అవకాశం..
జిల్లా నుంచి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా ఉన్న ఆకుల లలితకు వారం రోజుల తేడాతో వరుస గా రెండోసారి నిరాశ మిగిలింది. మరోసారి ఎమ్మెల్యే కోటాలో తనకు అవకాశం కల్పిస్తారని, ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి కచ్చితమైన హామీ ఉందని లలిత ధీమాతో ఉంటూ వచ్చా రు. ఎమ్మెల్యే అభ్యర్థి విషయానికి వస్తే వివిధ సమీకరణల నేపథ్యంలో చివరి నిముషంలో ఆకుల లలితకు స్థానం దక్కకుండా పోయింది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ స్థానంలో మరో ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన బండ ప్రకాష్‌కు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చా రు. దీంతో ఆయన రాజ్యసభ స్థానం ఖాళీ కానుంది. ఈ రాజ్యసభ స్థానంలో కల్వకుంట్ల కవితను భర్తీ చేసి లలితకు నిజామాబాద్ స్థాని క సంస్థల కోటా నుంచి అవకాశం కల్పిస్తారనే వార్తలు వచ్చాయి. మరోవైపు శాసన మండలి లో మున్నూరుకాపు సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం లేనందున లలితకు అవకాశం తప్పనిసరిగా కల్పిస్తారని రాజకీయ వర్గాలు భావించాయి.
అయితే కవిత రాజ్యసభ బదులు మళ్లీ తన సిట్టింగ్ స్థానానికే మొగ్గు చూపడంతో ఆకు లలలితకు నిరాశే మిగిలింది. లలితకు సముచిత స్థానం కల్పిస్తామని పార్టీ నాయకత్వం సూచించినట్లు తెలుస్తోంది. 2018లో కాంగ్రెస్ నుంచి తనతో పాటు మరో ముగ్గురు ఎమ్మెల్సీలను టీఆర్‌ఎస్‌లోకి తీసుకురావడంలో లలిత కీలక పాత్ర పోషించారు. లలిత వియ్యంకుడు నల్గొండ జిల్లాకు చెందిన నేతి విద్యాసాగర్ సైతం ఎమ్మెల్సీగా ఉండగానే కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎస్‌లోకి ఆమెతోపాటే వచ్చారు. ఆ సమయంలో కేసీఆర్ మరోసారి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించే విషయమై హామీ ఇచ్చారని, ల లిత ఇప్పటివరకు ధీమాగా ఉంటూ వచ్చారు. కాగా వివిధ సమీకరణల నేపథ్యంలో అంచనాలు తారుమారయ్యాయి. వారం రోజుల తేడాతో లలితకు ఎమ్మెల్యే కోటా, స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అవకాశాలు త్రుటిలో చేజారడం గమనార్హం. రాజకీయమంటే ఇలాగే ఉంటుందని వివిధ వర్గాల్లో చర్చ సాగుతోంది.