జాతీయం ముఖ్యాంశాలు

Covid-19 | దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు..

దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. మంగళవారం 7,579 కేసులు నమోదవగా, తాజాగా అవి 9 వేలు దాటాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 9283 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,45,35,763కు చేరింది. ఇందులో 3,39,57,698 మంది కరోనా నుంచి కోలుకోగా, 1,11,481 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మరో 4,66,584 మంది మహమ్మారి వల్ల మృతిచెందారు.

మంగళవారం ఉదయం నుంచి ఇప్పటివరకు కొత్తగా 437 మంది మరణించగా, 10,949 మంది కరోనా నుంచి కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.