రాయలసీమ ప్రాంతమంటే కరువు ప్రాంతమని..వర్షపు నీరు అంటే తెలియదని అంత అనుకునేవారు. కానీ రీసెంట్ గా రాయలసీమ లో భారీ వర్షాలు కురిసి వరద బీబత్సం సృష్టించాయి. ఈ వరదలకు భారీ స్థాయిలో ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లింది. చిత్తూరు, అనంతపురం, నెల్లూర్, కడప జిల్లాల్లో పలు గ్రామాల్లో ఇళ్లు కొట్టుకుపోవడంతో పాటు పంటలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా వేల సంఖ్యలో మూగజీవాలు మరణించాయి. గత కొన్ని ఏళ్లుగా చూడని వర్షపాతం నమోదైందని ప్రజలు అంటున్నారు. అల్పపీడనం ప్రభావంతో ఈ నాలుగు జిల్లాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
ఈ క్రమంలో ప్రముఖ నిర్మాణ సంస్థ గీత ఆర్ట్స్ సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ. 10 లక్షల విరాళం ప్రకటించింది. ఈ విషయం గీతా ఆర్ట్స్ తన అధికార ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. ఈ నిధి ని రాయలసీమ వరద భాదితుల కు సహాయం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞాప్తి చేసింది. అయితే సినిమా ఇండస్ట్రీ పై జగన్ సర్కార్ పలు ఆంక్షలు పెడుతున్నారు. తాజాగా బెనిఫిట్ షోస్ కు అనుమతి నిరాకరించారు. జీవో 35 ప్రకారం బెనిఫిట్ షో లకు ప్రత్యేక అనుమతి ఉంటుందని..అది కూడా చారిటీస్ కోసం మాత్రమే అనుమతి ఇస్తామని మంత్రి పేర్ని నాని తెలిపారు. చట్టం ప్రకారం ఇప్పటి వరకు నాలుగు ప్రదర్శన లు మాత్రమే చేయాల్సి ఉందని ఆయన వెల్లడించారు. ఇప్పటి వరకు థియేటర్ల ఇష్టా ఇష్టాల మీద ఆధార పడి టికెట్ల విక్రయాలు జరిగేవని… బస్సు, రైలు, విమాన టికెట్ల తరహాలోనే సినిమా టికెట్ల విక్రయిస్తామని తెలిపారు. సులభతరంగా సినిమా టికెట్ల విక్రయం జరిగేలా ఈ ప్రక్రియ ఉంటుందని… 1100 థియేటర్లలో ఆన్ లైన్ లో విక్రయం చేపడతామని ప్రకటన చేశారు.