వరంగల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఏకగ్రీవాన్ని ఎన్నికల అధికారులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
వరంగల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి 14 మంది నామినేషన్లు దాఖలు చేయగా స్క్రూటినీలో 10 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. మిగిలిన నలుగురిలో టీఆర్ఎస్ అభ్యర్థి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఒకరు. మిగతా ముగ్గురు స్వతంత్రులు కాగా, వీరు కూడా తమ నామినేషన్లను గురువారం ఉపసంహరించుకున్నారు. దీంతో టీఆర్ఎస్ అభ్యర్థి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ఏగక్రీవంగా ఎన్నికయ్యారు.