తెలంగాణ ముఖ్యాంశాలు

Siddipet | కొండ పోచమ్మను దర్శించుకున్న మంత్రి హరీశ్ రావు

జిల్లాలోని జగదేవ్ పూర్ మండలం తీగుల్ గ్రామంలో గల ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండ పోచమ్మ అమ్మవారిని మంత్రి హరీశ్‌రావు దర్శించుకున్నారు. గురువారం ఆలయ 20వ వార్షికోత్సవ వేడుకలకు హాజరైన మంత్రి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోచమ్మ తల్లీ రాష్ట్ర ప్రజలందరినీ చల్లగా సుభిక్షంగా ఉండేలా దీవించు తల్లీ అని వేడుకున్నారు.

ఈ మేరకు ఆలయ సమీపంలో ఓ భక్తుడు వేయించిన సదరు పట్నంలో మంత్రి పాల్గొన్నారు. మంత్రి వెంట ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.