అంతర్జాతీయం

Omicron Variant | కొత్త వేరియంట్ గుర్తించినందుకు శిక్షా: సౌతాఫ్రికా అసహనం

కరోనా కొత్త వేరియంట్‌ను గుర్తించినందుకు తమ దేశాన్ని ప్రపంచ దేశాలు శిక్షిస్తున్నాయని దక్షిణాఫ్రికా ప్రభుత్వం అసహనం వ్యక్తం చేసింది. ఇప్పటి వరకూ చూడని వేరియంట్‌ను గుర్తించినందుకు తమ దేశంలోని జీనోమ్ సీక్వెన్సింగ్ విధానాన్ని కొనియాడాలని సౌతాఫ్రికా అభిప్రాయపడింది.

అలాకాకుండా ప్రపంచ దేశాలు తమపై ట్రావెల్ బ్యాన్‌ విధించడం సరికాదని అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘కరోనా కొత్త వేరియంట్‌ను గుర్తించినందుకు మా దేశ ప్రయాణికులపై ఆంక్షలు విధించారు. కొత్త వేరియంట్‌ ఉందని గుర్తించిందుకు ఇది శిక్షించినట్లుగానే ఉంది’ అని దక్షిణాఫ్రికా ప్రభుత్వం పేర్కొంది.

కాగా, సౌతాఫ్రికాలో వెలుగు చూసిన కొత్త వేరియంట్‌కు ‘ఓమిక్రాన్‌’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేరు పెట్టింది. ఇది చాలా వేగంగా వ్యాపిస్తుండటంతో పలుదేశాలు సౌతాఫ్రికాపై ట్రావెల్‌ బ్యాన్‌ విధించిన సంగతి తెలిసిందే.