ఆంధ్రప్రదేశ్ జాతీయం ముఖ్యాంశాలు

నెల్లూరు వ‌ర‌ద బాధితుల‌కు సాయం అందించిన సోనూసూద్

గత నెల రోజులుగా ఏపీలో విస్తారంగా వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా రాయలసీమ లో ఎడతెరుపు లేకుండా కురుస్తున్న వర్షాలకు భారీగా నష్టం వాటిల్లుతుంది. ఒక అల్ప పీడనం అవ్వగానే మరో అల్పపీడనం మొదలవుతుండడం తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు , వరదలకు కోట్లాది ఆస్థి , ప్రాణ నష్టం వాటిల్లింది.

ఇక నెల్లూరు జిల్లాలో వ‌ర‌ద బాధితుల క‌ష్టాలు చూసి ఆపద్బాంధవుడు చ‌లించారు. ఆపద్బాంధవుడు అంటే ఎవరో అర్థమై ఉంటుంది అవును సోను సూద్ గురించే చెపుతున్నాం , కరోనా టైం లో కోట్లాది మందికి సాయం ..ఆ తర్వాత కూడా ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటూ వస్తున్న సోనూసూద్..తాజాగా నెల్లూరు జిల్లాలో వ‌ర‌ద బాధితుల క‌ష్టాలు చూసి చ‌లించారు. సోనూ సూద్ ఛారిటీ ఫౌండేష‌న్ త‌ర‌పున రెండు వేల బాధిత కుటుంబాల‌కు కిట్ల‌ని పంపిణీ చేశారు. ఈ కిట్‌లో బకెట్, మగ్గు, చాప, దుప్పట్లు నిత్యవసర సరుకులు ఉన్నాయి. నేటి నుండి బాధిత కుటుంబాలకు ఈ కిట్లను పంపిణీ చేసేందుకు సోనుసూద్ ఫౌండషన్ వాలంటీర్లు ఏర్పాట్లు చేస్తున్నారు.