ఏపీపై బీజేపీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఏపీ బీజేపీ కోర్ కమిటీని నియమించింది. ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు నేతృత్వంలో 16 మందితో కోర్ కమిటీని నియమించింది బీజేపీ అధినాయకత్వం. ఎంపీలైనా సరే తమను కోర్ కమిటీ భేటీలకు పిలవడం లేదని ఇటీవలే అమిత్ షా భేటీలో ఫిర్యాదు చేశారు సీఎం రమేష్, సుజనా చౌదరి.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నియమించిన కోర్ కమిటీ సభ్యులుగా సీఎం రమేష్, సుజనా తదితరులు వున్నారు. కోర్ కమిటీలో సభ్యులుగా సోము వీర్రాజు, పురందేశ్వరీ, కన్నా, టీజీ, సీఎం రమేష్, సుజనాలను నియమించింది. కోర్ కమిటీలో సభ్యులుగా సత్యకుమార్, జీవీఎల్ నరసింహారావు, మధుకర్, మాధవ్, నిమ్మక జయరాజ్, చంద్రమౌళి, శ్రీదేవి వున్నారు. ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రకాష్, మురళీధరన్, సునీల్ ధియోధర్ కి అవకాశం కల్పించింది బీజేపీ.