దేశంలో కరోనా కేసులు (Corona cases) మళ్లీ పెరిగాయి. 2020 మార్చి తర్వాత తొలిసారిగా మంగళవారం (నవంబర్ 30) అతి తక్కువ కేసులు నమోదయ్యాయి. అయితే మరోసారి 8 వేలకు పైగా రికార్డయ్యాయి.
దేశవ్యాప్తంగా 8954 కరోనా కేసులు కొత్తగా నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,45,96,776కు చేరింది. ఇందులో 3,40,28,506 మంది కరోనా నుంచి కోలుకోగా, 99,023 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మరో 4,69,247 మంది మహమ్మారికి బలయ్యారు. కాగా, గత 24 గంటల్లో కొత్తగా 10,207 మంది కరోనా నుంచి బయటపడగా, 267 మంది మృతిచెందారు. మొత్తం కేసుల్లో కేరళలోనే 4723 కేసులు ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకు 1,24,10,86,850 కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.