మొత్తం 131.99 కోట్ల వ్యాక్సిన్ డోసుల వినియోగం
దేశంలో కొత్తగా 7,992 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అదే విధంగా నిన్న కరోనా నుంచి 9,265 మంది కోలుకున్నారు. మరో 393 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ప్రస్తుతం 93,277 మంది కరోనాకు ఆసుపత్రులు/హోం క్వారంటైన్లలో చికిత్స తీసుకుంటున్నారు.
యాక్టివ్ కేసుల సంఖ్య 559 రోజుల కనిష్ఠానికి చేరుకుంది. కరోనాతో మొత్తం 4,75,128 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు మొత్తం 131.99 కోట్ల వ్యాక్సిన్ డోసులు వినియోగించారు.