జాతీయం ముఖ్యాంశాలు

ఎలక్ట్రానిక్‌ గోదాంలో భారీ అగ్నిప్రమాదం.. వీడియో

రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లా నీమ్రానాలో సోమవారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కన్సూమర్ ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ కంపెనీ గోడౌన్‌లో భారీగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 12 ఫైర్‌ టెండర్లను సంఘటనా స్థలానికి తరలించి, మంటలు ఆర్పివేశారు. అయితే, ప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. ప్రమాదంలో భారీ ఎత్తున నష్టం వాటిల్లిందని అధికారులు పేర్కొన్నారు.