జాతీయం

కాంగ్రెస్ పార్టీ 137వ ఆవిర్భావ దినోత్సవంలో సోనియాకు చేదు అనుభవం ..

నేషనల్ కాంగ్రెస్ పార్టీ 137వ ఆవిర్భావ దినోత్సవం ఈరోజు. ఈ సందర్బంగా సోనియాకు చేదు అనుభవం ఎదురైంది. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో మంగళవారం జెండా ఎగురవేస్తున్నప్పుడు అది ఒక్కసారిగా కిందపడిపోయింది. జెండా ఆవిష్కరణ చేయాల్సిన సోనియా దాన్ని నేలపై పడకుండా చేతులతో పట్టుకున్నారు. అక్కడున్న సిబ్బందిపై అసహనం వ్యక్తం చేసిన ఆమె జెండాను చేతులతో పైకెత్తి పార్టీ శ్రేణులకు చూపించి మిగతా కార్యక్రమాన్ని కానిచ్చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

హైదరాబాద్ గాంధీభవన్ లో 137 వ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ మాజీ అధ్యక్షులు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, వి.హెచ్, ఏఐసీసీ కార్యదర్శులు బోసు రాజు, సంపత్ కుమార్, చిన్నారెడ్డి, మధు యాష్కీ, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ ఎంపీ మల్లు రవి, కోదండ రెడ్డి, కుసుమ కుమార్ మాజీ ఎమ్మెల్యే పద్మావతి, సేవదళ్ చైర్మన్ ప్రసాద్ తదితరులు హాజరయ్యారు.