అంతర్జాతీయం ముఖ్యాంశాలు

అమెరికాలో ఒమిక్రాన్ కేసులు కలకలం

అగ్రరాజ్యం అమెరికాలో ఒమిక్రాన్ కేసులు కలకలం రేపుతున్నాయి. గురువారంనాడు ఆ దేశంలో ఏకంగా 5.80 లక్షల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత ఏడాది వింటర్‌తో పోల్చితే ఇప్పుడు అక్కడ రెట్టింపు పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో అమెరికాలో మునుపెన్నడూ లేనంత స్థాయిలో వైరస్ విజృంభిస్తున్నట్లు గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. అయితే ఆస్పత్రిలో చేరే వారి సంఖ్య, మరణాల సంఖ్య పెరగకపోవడం అమెరికాకు కాస్త ఊరట కలిగించే అంశం.

ఒమిక్రాన్‌తో తీవ్ర అస్వస్థతకు గురైయ్యే వారి సంఖ్య..డెల్టా బారినపడిన వారితో పోల్చితే చాలా తక్కువగానే ఉంది. గత రెండు వారాల్లో అక్కడ కోవిడ్ మరణాల సంఖ్య 5 శాతం మేర తగ్గింది. ప్రస్తుతం సరాసరిగా ప్రతిరోజూ 1,221 మరణాలు నమోదవుతున్నాయి. అదే సమయంలో ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యే కరోనా బాధితుల సంఖ్య 15 శాతం పెరిగింది. ప్రస్తుతం ప్రతి రోజూ సరాసరిగా 78,781 మంది కరోనా బాధితులు ఆస్పత్రిలో చేరుతున్నారు.