అంతర్జాతీయం

అమెరికాలో మంచు తుఫాను బీభ‌త్సం

వాతావరణ మార్పుల ప్రభావం అమెరికాపై స్పష్టంగా కనిపించింది. ఈ ఏడాది అగ్రరాజ్యంపై ప్రకృతి విపత్తులు విరుచుకుపడ్డాయి. మొన్నటి అకాల వర్షాలు, కార్చిచ్చుల నుంచి ఇప్పటి మంచు ఉత్పాతం దాకా అమెరికా ప్రతికూల పరిస్థితుల మధ్య మనుగడ కొనసాగిస్తున్నది. ప్రస్తుతం అక్కడ హిమపాతం ప్రమాదకరంగా మారింది. ఓవైపు వర్షాలు, ఇంకొకవైపు మంచు అనేక రాష్ట్రాల్లో జనజీవనాన్ని స్తంభింప జేసింది. ఆరుబయట ఆరు అడుగుల మందాన దట్టమైన మంచు దుప్పట్లు పరుచుకున్నాయి. ఉత్తర కాలిఫోర్నియాలోని సియెర్రా, నెవాడాలో దాదాపు 492 సెం.మీ. మంచు కురిసింది. 1970 నాటి 456 సెం.మీ. రికార్డును బ్రేక్‌ చేసింది. గత 24 గంటల్లోనే 99 సెం.మీ మంచు కురిసిందంటే శీతల వాతావరణం ఎంత సంక్లిష్టంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. మొత్తంగా డిసెంబర్‌ మాసంలో అక్కడ హిమపాతం 508 సెం.మీ దాటింది. ట్రాఫిక్‌ దాదాపుగా స్తంభిం చింది. వాహనదారులు తీవ్ర ఇక్కడ్లు ఎదుర్కొంటున్నారు.

రోడ్లపై మంచుగడ్డలను తొలగించే పనులు కొనసాగుతున్నప్పటికీ, నిరంతరం మంచు కురుస్తుండటం వల్ల ఆ ప్రయత్నాలు పెద్దగా ప్రభావం చూపడం లేదు. మంచు తుపానుల నుంచి ఉపశ మన, రెస్క్యూ చర్యలను ప్రభుత్వం కొనసా గిస్తు న్నది. ఆర్కిటిక్‌ మంచు కారణంగా సియాటెల్‌, వాషింగ్టన్‌ నగరాలు 50 ఏళ్లలో అత్యంత శీతల వాతా వరణాన్ని ఎదుర్కొం టున్నాయి. ఇక్కడ ఉష్ణోగ్రత మైనస్‌ ఏడు డిగ్రీలకు పడిపోయింది. అనేక ప్రాంతాలను మంచు కవచం కమ్మేసింది. ప్రస్తుతం నీటి వనరుల సమస్యను తగ్గించింది. భవిష్యత్‌లో కరవు మళ్లి ఉద్బవించవచ్చు అని పశ్చిమ రీజియన్‌ వాతావరణ కేంద్ర శాస్త్రవేత్త డాన్‌ మెక్‌వోయ్‌ అన్నారు.