తెలంగాణ ముఖ్యాంశాలు

ఈరోజు నల్గొండ జిల్లాలో కేటీఆర్ పర్యటన

ఈరోజు శుక్రవారం నల్గొండ జిల్లాలో మంత్రి కేటీఆర్ తో జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి పర్యటించనున్నారు. కొన్ని రోజుల క్రితం నల్గొండ జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి కేసీఆర్​…. సిద్దిపేట, గజ్వేల్‌ తరహాలో నల్గొండను అభివృద్ధి చేస్తామని చెప్పి భారీగా నిధులు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈరోజు మంత్రులు నల్గొండ జిల్లాలో పర్యటించి.. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఐటి హబ్ తోపాటు ఎస్సీ, ఎస్టీ వసతి గృహాల నిర్మాణాలు,సమీకృత మార్కెట్ సముదాయానికి శంకుస్థాపన చేయనున్నారు.

పట్టణ అభివృద్ధి కోసం ఇప్పటికే సుమారు ఐదు వందల కోట్ల రూపాయలతో ప్రాథమిక అంచనాలు తయారు చేసారు అధికారులు. అందులో మార్కెట్లు, రోడ్లు, వీధి దీపాలు, డివైడర్లు నిర్మాణం జంక్షన్ సుందరీకరణ పనులకు ప్రాధాన్యత ఇచ్చినట్టు తెలిసింది. నల్గొండ మున్సిపాలిటీతోపాటు జిల్లాలోనే మిర్యాలగూడ, దేవరకొండ, చండూరు, చిట్యాల, హాలియా, నందికొండ, నగరికల్ మున్సిపాలిటీ అభివృద్ధిపై సంబంధిత అధికారులతో మధ్యాహ్నం మూడు గంటలకు కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించనున్నారు.