మృతుల సంఖ్య మొత్తం 4,82,017
దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. నిన్న 37,379 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, 11,007 మంది కరోనా నుంచి కోలుకున్నారని తెలిపింది. నిన్న కరోనాతో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 124గా ఉందని చెప్పింది.
డైలీ పాజిటివిటీ రేటు 3.24 శాతంగా ఉంది. ప్రస్తుతం దేశంలో 1,71,830 మంది ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో చికత్స పొందుతున్నారు. ఇప్పటివరకు మొత్తం 3,43,06,414 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మృతుల సంఖ్య మొత్తం 4,82,017గా ఉంది. మొత్తం 1,46,70,18,464 డోసుల కరోనా వ్యాక్సిన్లు వినియోగించారు.