దేశంలో కరోనా , ఓమిక్రాన్ కేసులు భారీగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఢిల్లీ లో రోజు రోజుకు వేలసంఖ్య లో కేసులు పెరుగుతుండడం తో అక్కడి ప్రభుత్వం కఠిన ఆంక్షలు విదిస్తుంది. ఇప్పటీకే రాత్రి కర్ఫ్యూ కొనసాగుతుండగా..ఇప్పుడు శని, ఆదివారాల్లో పూర్తి కర్ఫ్యూ ను విధించింది. ఈ మేరకు ప్రభుత్వం ప్రకటన చేసింది. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం కల్పించింది. ఇక కరోనా రూల్స్ కఠినంగా అమలు చేయాలని పోలీసులకు , అధికారులకు ఆదేశాలు జారీచేసింది. ఇదిలా ఉంటె ఈరోజు ఉదయమే ఢిల్లీ ముఖ్య మంత్రి అరవింద్ కేజ్రీవాల్ కరోనా మహమ్మారి బారిన పడ్డారు. కరోనా పాజిటివ్ తేలడంతో హో ఐసోలేషన్ కు వెళ్లారు.
ఢిల్లీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 4099 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవగా… ఒకరు మృతి చెందారు. అలాగే కరోనా నుంచి కోలుకుని 1,509 మంది డిశ్చార్జ్ అయ్యారు. అలాగే దేశ రాజధానిలో కోవిడ్ పాజిటివీటి రేటు 6.49 శాతంగా ఉంది. ప్రస్తుతం 10,986 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు కోవిడ్‌తో మృతి చెందిన వారి సంఖ్య 25,100గా నమోదు అయ్యింది. గత 24 గంటల్లో భారతదేశంలో 10,846 రికవరీలు నమోదు అయ్యాయి. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,45,582గా ఉంది.