ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు

నా కంఠంలో ప్రాణమున్నంత వరకు నగరి ప్రజలకు సేవ చేస్తాను – మంత్రి రోజా

ఏపీ పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నగరి ఎమ్మెల్యే రోజా..మంత్రి అయ్యాక మొదటిసారి నగరి నియోజకవర్గం లో సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మంత్రిగా తన సత్తా ఏమిటో చూపిస్తానని … ఇప్పటి వరకు ఒక లెక్కని, ఇకపై మరో లెక్క అని తెలిపింది. తనకు కేటాయించిన పర్యాటకశాఖ ద్వారా రాష్ట్రానికి ఆర్థిక వనరులు సమకూర్చడంపై దృష్టి సారిస్తానన్నారు.

తనకు ఇక సీటు రాదని, రోజా పని అయిపోయిందని ప్రచారం జరిగిందని, అలా ఎగతాళి చేసిన వారి నోళ్లు మూతపడేలా ఇక్కడి ప్రజలు తనను రెండుసార్లు గెలిపించారని అన్నారు. తల్లిదండ్రులు తనకు జన్మనిచ్చారని, నగరి ప్రజలు తనకు రాజకీయ జన్మనిచ్చారని రోజా అన్నారు. 2024లోనూ జగనే ముఖ్యమంత్రి అవుతారని రోజా ధీమా వ్యక్తం చేశారు. తన కంఠంలో ప్రాణమున్నంత వరకు నగరి ప్రజలకు సేవ చేస్తానని, చివరి రక్తపు బొట్టు వరకు జగనన్న కోసం పనిచేస్తానని రోజా చెప్పుకొచ్చారు.