తెలంగాణ

న‌ల్గొండ‌లో దారుణం : మైసమ్మ గుడి వద్ద నరబలి

తెలంగాణలోని న‌ల్గొండ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. విరాట్ నగర్ మైసమ్మ గుడి వద్ద నరబలి చోటుచేసుకోవడం జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం నరబలి ఇచ్చి మొండెం నుంచి తలను వేరు చేసి మొండాన్ని తీసుకుపోయి తలను మాత్రం అక్కడే వదిలేసి వెళ్లినట్లు తెలుస్తుంది. స్థానికులు ఈ ఘటన చూసి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.

వెంటనే పోలీసులు ఘ‌ట‌నా స్థలానికి చేరుకుని మొండం లేని త‌ల ను స్వాధీనం చేసుకొని కేసు న‌మోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. దుండ‌గులు త‌లను ఇక్క‌డే ఎందుకు విడిచిపెట్టారు అని పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. అలాగే ఇది హ‌త్యా లేదా న‌ర‌బ‌లి జ‌రిగిందా అనే కోణంలో పోలీసులు విచార‌ణ చేప‌ట్టారు. ఈ ఘటన తర్వాత ఆలయానికి వెళ్లేందుకు భక్తులు భయపడుతున్నారు.