రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 317పై నిరసనలు జరుగుతున్నాయి. ఈజీవోను ఉపాధ్యాయులు, ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే ప్రభుత్వ ఉద్యోగుల వ్యతిరేక జీవో అక్రమ అరెస్టులకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టాలని నిర్ణయించారు. తాజాగా విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఇంటి వద్ద ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి.
బదిలీలకు నిరసనగా జూనియర్ లెక్చరర్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటి ముందు ఆందోళనకు దిగారు. బదిలీల్లో న్యాయం చేయాలని మంత్రి సబితా ఇంటి ముందు జూనియర్ లెక్టరర్లు బైఠాయించారు. బదిలీల్లో అవకతవకలు జరిగాయని, ఈ అవకతవకలకు పాల్పడిన అధికారులను సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రక్త వాతారణం నెలకొంది.