హోమ్ ఐసొలేషన్ లో చికిత్స
ఆంధ్రప్రదేశ్ లో పలువురు రాజకీయ ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. ప్రకాశం జిల్లాలో పలువురు రాజకీయ నేతలకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబుకు కరోనా రావడంతో హోం ఇసోలేషన్ లో ఉన్నారు. కనిగిరి మాజీ ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డికి పాజిటివ్ తేలింది. ఇదిలా ఉండగా రాష్ట్ర విధ్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి భార్యకు కరోనా సోకడంతో ఆమెతో పాటు మంత్రి కూడా హోం ఐసోలేషన్లో ఉన్నారు. కాగా మరో మంత్రి అవంతి శ్రీనివాస్ , ఎమ్మెల్యేలు ధర్మాన ప్రసాద్, అంబటి రాంబాబు ఇటీవలే కరోనా బారిన పడిన విషయం విదితమే.