ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ తాజాగా కొన్ని సంస్థల ఆస్తులు జప్తు చేసినట్లుగా ప్రకటన విడుదల చేసింది. ఆ స్టేట్‌మెంట్‌లో చంద్రబాబు ప్రస్తావన లేదు. స్కిల్ కేసు అంటే.. అందరికీ చంద్రబాబు అరెస్టే గుర్తుకు వస్తుంది. ఆ కేసులో ఈడీ కూడా నోటీసులు జారీ చేసిందని ఆరోపిస్తూ సీఐడీ కేసులు పెట్టింది. ఆయనకు కనీసం నోటీసులు ఇవ్వకుండా ఓ అర్థరాత్రి అరెస్టు చేసి జైలుకు పంపారు. యాభై మూడు రోజుల తర్వాత బెయిల్ వచ్చింది. ఆ కేసులో సీఐడీ ఒక్క రూపాయి అక్రమ లావాదేవీ చూపించలేకపోయిందని బెయిల్ ఇచ్చిన సమయంలో హైకోర్టు స్పష్టం చేసింది. ఆ కేసులోతాజాగా ఈడీ చేసిన ప్రకటన మరింత కీలకంగా మారింది. స్కిల్ కేసులో ఈడీ షెల్ కంపెనీలకు నిధుల మళ్లింపుపై విచారణ జరిపింది. గతంలోనే నలుగురిని అరెస్ట్ చేసింది. మనీలాండరింగ్ కింద కేసు నమోదు చేసింది. దర్యాప్తు ప్రభుత్వం నుంచి సీమన్స్ కంపెనీకి వచ్చిన నిధుల్ని షెల్ కంపెనీలకు మళ్లించారు నిందితులు. పన్నులు ఎగ్గొట్టడానికి ఇలా చేశారని ఈడీ ఆరోపణ. శేఖర్ బోస్, ముకుల్ అగర్వాల్, సురేష్ గోయల్, వికాస్ వినాయక్‌లను ఇప్పటికే విచారించింది ఈడీ.
షెల్ కంపెనీలను ఏర్పాటు చేసి రూ.241 కోట్లను మళ్లించారని ఈడీ చెబుతోంది. ఇప్పటికే డిజైన్ టెక్‌కి సంబంధించిన రూ.31.20 కోట్ల ఆస్తులు జప్తు చేశారు. ఈ మేరకు ఈడీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈడీ తాజా విచారణ తర్వాత చంద్రబాబుకు ఈ అంశంలో ఎలాంటి ప్రమేయం లేదని స్పష్ట మయినట్లయిందని టీడీపీ వర్గాలంటున్నాయి. ఈడీ విచారణ ప్రకారం.. నిధుల డైవర్షన్ విషయంలో చంద్రబాబు ప్రమేయం లేదని .. వినాయక్ ఖాన్వెల్కర్, సుమన్ బోస్, వంటి వారు బోగస్ ఇన్వాయిస్‌లు సృష్టించి ఈ పనికి పాల్పడ్డారని అనకోవచ్గుచు. ప్రెస్ నోట్‌లో కూడా అదే చెప్పారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా ఈడీ స్టేట్ మెంట్ లో లేదు. మొత్తం వ్యవహారంలో చంద్రబాబుకు కానీ ఆయన కు సంబంధించిన వారికి డబ్బులు అందినట్లుగా ఎక్కడా చెప్పలేదు. అంటే ఈ వ్యవహారంలో చంద్రబాబు ప్రమేయం ఉన్నట్లుగా ఈడీ గుర్తించలేదని అర్థం చేసుకోవచ్చు.
అయితే ఆయా కంపెనీలు షెల్ కంపెనీల ద్వారా మళ్లించిన సొమ్ము మళ్లీ చంద్రబాబుకు చేరిందని సీఐడీ ఆరోపించింది. చివరికి ఎలక్టోరల్ బాండ్ల ద్వారా వచ్చాయని కూడా వాదించారు. అయితే అనూహ్యంగా తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎలక్టోరల్ బాండ్లు వెలుగులోకి వచ్చాయి. టీడీపీకి స్కిల్ కేసులో ఉన్న ఒక్క కంపెనీ కూడా విరాళివ్వలేదు. ఇప్పుడు చంద్రబాబుపై సీఐడీ అధికారులు ఆధారాల్లేకుండా తప్పుడు కేసులు పెట్టినట్లుగా రుజువు అయిందని టీడీపీ వర్గాలు వాదిస్తున్నాయి.