హోమ్ ఐసోలేషన్ లో ఉన్నట్టు ట్వీట్
తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్నిఆయన ఇవాళ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నానని, ముందు జాగ్రత్త చర్యగా హోం ఐసోలేషన్‌లో ఉన్నట్టు తెలిపారుల్. . తనను కలిసిన వారందరూ వీలైనంత త్వరగా కరోనా పరీక్షలు చేయించుకుని, జాగ్రత్తలు తీసుకోవాలని నారా లోకేష్ సూచించారు. ప్రజలందరూ సురక్షితంగా ఉండాలని ఆకాంక్షించారు.