కొత్తగా 4,108 నమోదు
ఆంధ్రప్రదేశ్ లో పెరుగుతున్న కరోనా కేసులు ఆందోళన కల్గిస్తున్నాయి. 24 గంటల్లో కొత్తగా 4,108 కోవిడ్ కేసులు నమోదు అయ్యాయి. ఇదేసమయంలో 696 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. అత్యధికంగా చిత్తూరు, విశాఖ జిల్లాల్లో వెయ్యికి పైగా కేసులు నమోదు అయ్యాయి. గుంటూరు జిల్లా లో 345, కడపలో 295, నెల్లూరులో 261, ప్రకాశంలో 176, కృష్ణాలో 170 అనంతపురంలో 162, తూర్పుగోదావరిలో 263, శ్రీకాకుళంలో 114, విజయనగరంలో 169, పశ్చిమ గోదావరి జిల్లాలో 46 కేసులు నమోదు అయ్యాయి . ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 21,10,388 కు పెరిగింది.