నూజివీడు రైల్వే స్టేషన్ లో వీడ్కోలు పలికిన అధికార యంత్రంగం
Vice President Venkaiah Naidu on a special train from Nuzvid to Visakhapatnam on Wednesday morning
ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు కృష్ణాజిల్లాలో మూడు రోజుల పర్యటన ముగించుకొని బుధవారం ఉదయం 6 గంటలకు నూజివీడు రైల్వే స్టేషన్ నుండి ప్రత్యేక రైలులో విశాఖపట్టణంకు బయలు దేరారు . వెంకయ్య నాయుడుకు నూజివీడు రైల్వే స్టేషన్ లో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, రాష్ట్ర డిజిపి గౌతమ్ సవాంగ్ , కృష్ణ జిల్లా కలెక్టర్ జె నివాస్ , జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్, రైల్వే డి ఆర్ ఎం శివేంద్ర మోహన్ , ప్రోటోకాల్ డైరెక్టర్ డైరెక్టర్ బాల సుబ్రహ్మణ్యం రెడ్డి , అడిషనల్ డైరెక్టర్ శర్మ నూజివీడు ఆర్టీవో కే రాజ్యలక్ష్మి, డి ఎస్ పి బి శ్రీనివాసులు, రెవిన్యూ, పోలీస్, రైల్వే సిబ్బంది ప్రభృతులు వీడ్కోలు పలికారు.