జాతీయం ముఖ్యాంశాలు

భార‌త్ లో కరోనా విలయతాండవం

3,33,533 కొత్త కేసులు : కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడి

భార‌త్ లో రోజు రోజుకి క‌రోనా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 3,33,533 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక దేశంలో యా క్టివ్ కరోనా కేసుల సంఖ్య 21,87, 205 కు చేరింది. ఇక దేశం లో కరోనా పాజిటివిటి రేటు 93.18 శాతంగా ఉంది. ఇక దేశ వ్యా ప్తంగా ఆ రికవరీ ల సంఖ్య 3,65,60,650 కు చేరింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 161.92 కోట్ల మందికి కరోనా వ్యాక్సిన్లు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. అలాగే ఇప్పటి వరకు 71.55 కోట్ల మందికి కరోనా పరీక్షలు చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఇక ఇప్పటి వరకు ఇండియా వ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య 4.89 లక్షలకు చేరింది.