ఆంధ్రప్రదేశ్

సీఎం జగన్ కు లేఖ రాసిన ముద్రగడ

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రాష్ట్ర ముఖ్యమంత్రి వైెెఎస్ జగన్మోహన్ రెడ్డి లేఖ రాశారు. ప్రభుత్వం జిల్లా పెంపు ప్రతిపాధన గురించి ప్రస్తావించారు. అయితే జిల్లాల పేర్లపై కొన్ని సూచనలు చేశారు. అందులో గోదావరి జిల్లాలో ఏదో ఒక జిల్లాకు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు.. మరో జిల్లాకు శ్రీకృష్ణ దేవరాయలవారి పేరు పెట్టాలని కోరారు. దీంతోపాటు కోనసీమలోని జిల్లాకు లోక్ సభ స్పీకర్ స్వర్గీయ బాలాజీ గారి పేరు పెట్టాలని విన్నవించారు.

తన లేఖలో ఇలా రాశారు..”మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్పుకి తమరు శ్రీకారం చుట్టారని పత్రికలలో చూశానండి.. అంటూ పేర్కొన్నారు. నాదొక చిన్న మనవి దయచేసి అవకాశం ఉంటే మనసుపెట్టి పెద్దల పేర్లు పలు జిల్లాలకు పెట్టడానికి పరిశీలించమని కోరుచున్నాను. తూర్పు లేక పశ్చిమగోదావరిలో ఒక జిల్లాకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు.. ఏదో ఒక జిల్లాకి శ్రీకృష్ణదేవరాయలు పేరు పెట్టాలని.. కోనసీమకి లోక్ సభ స్పీకర్ స్వర్గీయ బాలాజీ గారి పేరు పెట్టాలని నా విన్నపం.” అంటూ లేఖలో ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం సీఎం జ‌గ‌న్ ను కోరారు.