జాతీయం ముఖ్యాంశాలు

భారీ లాభాల్లో ముగిసిన మార్కెట్లు

నిన్న భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు ఈరోజు కూడా అదే ధోరణిని కనబరిచాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 696 పాయింట్లు లాభపడి 59,558కి చేరుకుంది. నిఫ్టీ 203 పాయింట్లు పెరిగి 17,780 వద్ద స్థిరపడింది. ఈరోజు అన్ని సూచీలు లాభాలను మూటకట్టుకున్నాయి.