ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ పై బదిలీవేటు పడింది. ఆయన స్థానంలో కొత్త డీజీపీగా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఇంటెలిజెన్స్ డీజీపీ బాధ్యతలు కూడా ప్రస్తుతానికి రాజేంద్రనాథ్ రెడ్డి వద్దే ఉన్నాయి. మరోవైపు, గౌతమ్ సవాంగ్ ను జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులను వెలువరించింది.
గతంలో విజయవాడ, విశాఖపట్నం పోలీస్ కమిషనర్ గా రాజేంద్రనాథ్ రెడ్డి పని చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ ఈస్ట్ డీసీపీగా పని చేశారు. సీనియారిటీలో ద్వారకా తిరుమలరావు ముందున్నప్పటికీ రాజేంద్రనాథ్ ను డీజీపీగా నియమించడం గమనార్హం. రాజేంద్రనాథ్ 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. గౌతమ్ సవాంగ్ కు ప్రభుత్వం ఇంతవరకు కొత్త పోస్టింగ్ ఇవ్వలేదు.