ఉక్రెయిన్ సరిహద్దుల నుంచి రష్యా తన దళాలను వెనక్కు రప్పిస్తోందంటూ ఓపక్క వార్తలు వస్తున్నప్పటికీ… మరోపక్క, ఉక్రెయిన్ పై రష్యా దాడి చేస్తుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఘంటాపథంగా చెబుతున్నారు. దౌత్య చర్యలు, చర్చల ద్వారా ఉక్రెయిన్ సంక్షోభాన్ని ఇప్పటికీ నివారించే అవకాశం ఉందని చెప్పారు. ఒకవేళ రష్యా దండెత్తితే మాత్రం ఆంక్షలను విధించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని రష్యాను హెచ్చరించారు.రష్యా ఇప్పుడు బలగాలను వెనక్కు తీసుకుంటున్నామని చెబుతున్నా.. ఉక్రెయిన్ పై దాడి చేసే ముప్పు ఇంకా పోలేదంటూ విశ్లేషకులు చెబుతున్నారని ఆయన అన్నారు. ఏం జరిగినా దానికి తగ్గట్టు ప్రతిస్పందించేందుకు అమెరికా సిద్ధంగా ఉందన్నారు. ఉక్రెయిన్ పై రష్యా దాడి చేస్తే మాత్రం నిర్ణయాత్మకంగా తాము స్పందిస్తామన్నారు. అలాగే, బలగాల ఉపసంహరణకు సంబంధించి రష్యా తమకు ఆధారాలు చూపించాలని ఆయన డిమాండ్ చేశారు. రష్యా తమకేం శత్రువు కాదని బైడెన్ స్పష్టం చేశారు. దౌత్యచర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని పుతిన్ కు సూచించారు. ఇతర దేశాల భూమి హక్కులు, ప్రాంతీయ సమగ్రతకు హాని కలిగితే మాత్రం తమ సహజ సూత్రాలను మాత్రం వదులుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
Related Articles
వాళ్లు చూపించనంత మాత్రాన వాస్తవాలు ప్రజలకు తెలియకుండా ఆగాయా?
0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email ఐటీడీపీ కార్యకర్తలతో చంద్రబాబు సమావేశంరూ.40 కోట్ల సుపారీ ఎవరి రక్తచరిత్ర? టీడీపీ అధినేత చంద్రబాబు ఐ-టీడీపీ విభాగం సభ్యులతో నేడు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కులం, మతం, ప్రాంతం గురించి మాట్లాడేది చేతకానివాళ్లేనని విమర్శించారు. సమర్థులు అభివృద్ధి గురించి ఆలోచిస్తారని అన్నారు. […]
యూపీఎస్సీ ప్రిలిమ్స్‌లో చరిత్ర నుంచే 20 ప్రశ్నలు.. ‘కీ’ విడుదల చేసిన సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ
0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీఎస్ఈ) ప్రాథమిక పరీక్షను ఆదివారం నిర్వహించింది. పరీక్ష ఇంతకు ముందు జూన్ 29న జరుగాల్సి ఉండగా.. దేశంలో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో వాయిదా పడింది. యూపీఎస్సీ సీఎస్సీ ప్రిలిమ్స్ దేశవ్యాప్తంగా ఇవాళ 77 […]
చంద్రయాన్-3 ప్రయోగం కౌంట్ డౌన్.. వాయిస్ వినిపించిన ఇస్రో శాస్త్రవేత్త కన్నుమూత
వరుసగా రెండు ప్రయోగాలతో ప్రపంచం దృష్టిని ఆకర…