ప్రధాని మోడీ ని విమర్శించవద్దని గతంలో చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్… ఇప్పుడు అదే ప్రధానిపై నీచంగా మాట్లాడుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. 1985 నుంచి ఇప్పటి వరకు ఓడిపోని కేసీఆర్ కు… ఇప్పుడు ప్రశాంత్ కిశోర్ అవసరం ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. కేసీఆర్ కుట్రలు, కుతంత్రాలు ప్రజలకు అర్థమైపోయాయని… అందుకే పీకేను తెచ్చుకున్నారని ఎద్దేవా చేశారు. పీకే కన్నా పెద్ద మేధావులు తెలంగాణలో ఉన్నారని అన్నారు. దుబ్బాకలో, హుజూరాబాద్ ఎన్నికల్లో బీజేపీ గెలిచిందని చెప్పారు. రజకులకు, నాయీబ్రాహ్మణులకు ఇచ్చే సబ్సిడీ ఎందుకు ఆగిపోయిందని ప్రశ్నించారు. ఇంత చిల్లర వ్యవహారాలు ఎందుకు చేస్తున్నారు ముఖ్యమంత్రిగారూ అని అడిగారు.దళిత బస్తీల్లో కరెంట్ ఎందుకు కట్ చేస్తున్నారని ప్రశ్నించారు. రైతుల ధాన్యం విషయంలో కేసీఆర్ ఇప్పటికే అభాసుపాలయ్యారని… ఇప్పుడు కూడా రజకులు, నాయీ బ్రాహ్మణులు, వ్యవసాయ మీటర్ల విషయంలో అభాసుపాలవుతారని చెప్పారు. కేసీఆర్ ఒక గురువింద గింజ అని విమర్శించారు. మోదీతో కేసీఆర్ కు పోలికేంటని ఎద్దేవా చేశారు. రాష్ట్ర మంత్రులను, ఎమ్మెల్యేలను కేసీఆర్ జీవచ్ఛవాల్లా మార్చారని దుయ్యబట్టారు.
Related Articles
డిసెంబర్ 14 వరకు ఆధార్ అప్ డేట్
ఆధార్ కార్డ్‌లోని వివరాలను పూర్తి ఉచితంగా అప్డేట్ చ…
తెలంగాణలో మూడు రోజులు వర్షాలు
0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. రాష్ట్రంలో పశ్చిమ దిశనుంచి కిందిస్థాయి గాలులు వీస్తున్నాయని తెలిపింది. వీటి ప్రభావంతో సోమ, మంగళ, బుధవారాల్లో తేలికపాటి నుంచి ఒకటి రెండు చోట్ల మోస్తరు […]
టీకా తీసుకున్న ఆరు నెలల్లోనే తగ్గుతున్న యాంటీబాడీలు.. ఏఐజీ అధ్యయనం
0 Share Facebook 0 Share Twitter 0 Share LinkedIn 0 Share Pinterest 20K 20000 Telugoodu news 0 Share Telegram 0 Share Email 1636 మంది ఆరోగ్య కార్యకర్తలపై ఏఐజీ అధ్యయనంఐజీజీ-ఎస్1, ఐజీజీ-ఎస్2 యాంటీబాడీల్లో తగ్గుదల కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ప్రతిరోధకాలు (యాంటీబాడీలు) పెరిగి వైరస్ నుంచి రక్షణ లభిస్తుంది. ప్రపంచంలోని ఏ శాస్త్రవేత్త అయినా చెప్పేది ఇదే. అయితే, టీకా తీసుకోవడం ద్వారా దీర్ఘకాలంపాటు రక్షణ లభించే […]