జాతీయం ముఖ్యాంశాలు

వాహనదారులకు చుక్కలే, మరోసారి పెరిగిన పెట్రోల్‌- డీజిల్‌ ధరలు

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మరోసారి వాహనదారులకు చుక్కలు చూపించాయి. బుధవారం రోజు లీటర్‌ పెట్రోల్‌ పై 26 పైసలు,డీజిల్‌ పై 13పైసలు పెరిగాయి. దీంతో హైదరాబాద్‌ లో లీటర్‌ పెట్రోల్‌ రూ.100.46 కాగా డీజిల్‌ ధర రూ. 95.28 గా ఉంది. ఇక హైదరాబాద్‌ తో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో చమురు కంపెనీలు ధరల్ని పెంచాయి. 

అధికారిక లెక్కల ప్రకారం ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, ముంబై, హైదరాబాద్ లలో చమురు కంపెనీలు డీజిల్‌ పెట్రోల్‌ ధరల్ని పెంచాయి.  ఈ రోజు ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్ ధర రూ. 96.66 రూపాయలుగా ఉంది. ఇది నిన్నటితో పోలిస్తే ఈరోజుకి  25 పైసలు పెరిగింది. 13 పైసలు పెరిగి  లీటర్‌ డీజిల్‌ ధర రూ .87.28కు చేరింది.  ముంబై మెట్రో నగరాల్లో పెట్రోల్ ధర  అత్యధికంగా ఉంది. లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 102.82 రూపాయలు ఉండగా డీజిల్ ధర లీటర్‌ కు  రూ.94.84 కు ఉంది. దేశంలో అత్యధికంగా రాజస్థాన్ లోని శ్రీ గంగానగర్ జిల్లాలో పెట్రోల్ ధర రూ. 107 ఉండగా, డీజిల్ ధర లీటర్‌ కు రూ.100.51 గా ఉంది.  వివిధ నగరాల్లో వేర్వేరు ధరల కారణంగా ఢిల్లీ మరియు ముంబై మధ్య ధరల వ్యత్యాసం ఉంది. సరుకు రవాణా, ఛార్జీలు, స్థానిక పన్నులు మరియు వ్యాట్ ఆధారంగా పెట్రోల్ మరియు డీజిల్ ధరలను పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయించాయి.