జాతీయం ముఖ్యాంశాలు

దేశంలో కొత్త‌గా 30,615 క‌రోనా కేసులుమొత్తం 173.86 కోట్ల డోసుల వ్యాక్సిన్ల వినియోగం

దేశంలో మొన్న‌ న‌మోదైన క‌రోనా కేసుల కంటే నిన్న 11 శాతం అధికంగా కేసులు న‌మోద‌య్యాయి. దేశంలో కొత్త‌గా 30,615 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్‌లో తెలిపింది. క‌రోనా నుంచి నిన్న‌ 82,988 మంది కోలుకున్నారని వివ‌రించింది. నిన్న 514 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయార‌ని తెలిపింది.

ఇక దేశంలో ప్ర‌స్తుతం 3,70,240 మంది క‌రోనాకు ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో చికిత్స తీసుకుంటున్నారు. రోజువారీ పాజిటివిటీ రేటు 2.45 శాతంగా ఉంది. కోలుకున్న వారి సంఖ్య మొత్తం 4,18,43,446గా ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 173.86 కోట్ల డోసుల వ్యాక్సిన్లు వేశారు.