రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో ప్రధాని మోడీ సమావేశమయ్యారు. ఉక్రెయిన్ – రష్యా యుద్ధంపై ఇండియా అనుసరిస్తోన్న వైఖరితో పాటు పలు అంశాలపై రాష్ట్రపతికి ..మోడీ వివరించినట్టు సమాచారం. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను.. ముఖ్యంగా విద్యార్థులను తరలించడానికి ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ గంగా గురించి రాష్ట్రపతికి మోడీ వివరించనున్నారు.
ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయ పౌరులను తిరిగి స్వదేశానికి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై మోడీ కోవింద్‌కు వివరించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఉక్రెయిన్ గగనతలం మూసివేసినందున అక్కడ చిక్కుకుపోయిన భారతీయులను తొలుత సరిహద్దు దేశాలైన రొమేనియా, హంగేరి చేరుకునేలా సూచనలు చేస్తున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానాల్లో భారత్‌కు తరలిస్తున్నారు. అలాగే పోలాండ్, స్లోవేకియాలకు చేరుకున్న భారతీయులను తరలింపును ప్రారంభించనున్నారు.