అమరావతి: సీఎం జగన్ వ్యక్తిగత అజెండాతో విద్యుత్ రంగం సర్వనాశనం చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు దుయ్యబట్టారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యుత్ చార్జీలు తగ్గిస్తానని చెప్పి.. ప్రజలపై రూ.42,172 కోట్ల భారం పోపారని మండిపడ్డారు. ఏపీలో ఉన్న విద్యుత్ రేట్లతో పరిశ్రమలు ముందుకురాలేదని తెలిపారు. సంపన్న వర్గాల కోసం జగన్ ప్రభుత్వం పనిచేస్తోందని మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో నిరంతర విద్యుత్ ఇచ్చామని, ఇప్పుడు విద్యుత్ కోతలు విధిస్తున్నారని తప్పుబట్టారు. జగన్ అధికారంలోకి వచ్చాక సౌర, పవన విద్యుత్ దెబ్బతిన్నాయని చంద్రబాబు విమర్శించారు.
జగన్ వ్యక్తిగత అజెండాతో విద్యుత్ రంగం సర్వనాశనం: చంద్రబాబు