జాతీయం ముఖ్యాంశాలు

పాన్‌-ఆధార్‌ అనుసంధానానికి… గడువు పొడిగింపు…

వచ్చే ఏడాది మార్చి వరకు రుసుముతో అవకాశం

హైదరాబాద్ : పాన్‌-ఆధార్‌ అనుసంధానానికి సంబంధించి గడువును మరోమారు పొడిగించారు. వాస్తవానికి ఈ ప్రక్రియకు నేటి(గురువారం)తో గడువు ముగియనుంది. కాగా… గడువును మరోమారు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ క్రమంలో.. వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఈ అనుసంధానానికి వెసులుబాటు ఏర్పడింది. పాన్‌ (పర్మినెంట్‌ ఖాతా నంబరు)ను ఆధార్‌తో అనుసంధానం చేసుకోనిపక్షంలో…  ఏప్రిల్‌ ఒకటి నుంచి 3 నెలల్లో, లేదా… జూన్‌ 30 నాటికి అనుసంధానం చేస్తే రూ.500, ఆ తర్వాత చేసే వారు రూ. వెయ్యి జరిమానా చెల్లించాల్సి ఉంటుందని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) తెలిపింది. పాన్‌ను ఆధార్‌తో అనుసంధానం చేయకపోయినా 2023 మార్చి వరకు పాన్‌ పనిచేస్తుందని, ఆ తర్వాత పనిచేయదని పేర్కొంది. కాగా… ఈ అనుసంధాన ప్రక్రియకు తాజాగా మరోమారు గడువు(వచ్చే ఏడాది మార్చి 31 వరకు) పెంచుతూ ప్రభుత్వం నిర్ణయించింది. పాన్‌-ఆధార్‌ అనుసంధానం, అనుసంధానం అయినదీ లేనిదీ ఆదాయ పన్ను ఈ-ఫైలింగ్‌ పోర్టల్‌ ద్వారా తెలుసుకోవచ్చు.