ఆంధ్రప్రదేశ్ రాజకీయం

ఓ వైపు విద్యుత్ చార్జీలు.. మరోవైపు పవర్ కట్: సోము వీర్రాజు

అమరావతి: రాష్ట్రంలో ఒక వైపు విద్యుత్ చార్జీలను పెంచి మరోవైపు అనధికారికంగా పవర్ కట్‌ను ప్రారంభించారని బీజేపీ రాష్ట్ర  అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఏపీలో సామాన్యులపై జగన్ సర్కార్ విద్యుత్ చార్జీల బాదుడు ప్రకటన వెంటనే వాపస్ తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల భారీగా విద్యుత్ చార్జీలు పెరిగాయని ఆయన ఆరోపించారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు ప్రకారం 30 యూనిట్ల వారికి యూనిట్‌కు 45 పైసల భారాన్ని సామాన్యుడిపై వేశారన్నారు. ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలను ఉపసంహరణ చేసేంతవరకు ఉద్యమం కొనసాగిస్తామని ఆయన ప్రకటించారు. విద్యుత్ విషయంలో ప్రభుత్వం తుగ్లక్ చర్యలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు.