అంతర్జాతీయం తెలంగాణ

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో బంగారం బిస్కట్ల సీజ్

హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద 6 బంగారం బిస్కెట్లను అధికారుల సీజ్ చేశారు. గురువారం శంషాబాద్ ఎయిర్‌పోర్టులో  కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద 6 బంగారం బిస్కెట్లను అధికారులు గుర్తించి, సీజ్ చేశారు. దుబాయ్ ప్రయాణికుడి నుంచి రూ. 37.30 లక్షల విలువైన 699.5 గ్రాముల బంగారాన్నిఅధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు కస్టమ్స్ అధికారులు తెలిపారు.