తెలంగాణ

తన నివాసంపై నల్ల జెండాను ఎగరేసిన మంత్రి గంగుల

వరి సేకరణ సమస్య పై నిరసనగా సీఎం కెసిఆర్ , మంత్రి కేటిఆర్ ఇచ్చిన పిలుపు మేరకు మంత్రి గంగుల కమలాకర్ నల్ల జెండాను ఎగురవేశారు. శుక్రవారం ఉదయం మంత్రి గంగుల నల్ల డ్రెస్ ను ధరించి.. కరీంనగర్ లోని తన నివాసంపై నల్ల జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర వైఖరి నిరసనగా రైతులు తమ ఇండ్లపై నల్ల జెండాలు ఎగరేసరని తెలిపారు. జిల్లావ్యాప్తంగా 35 వేల గృహాలపై నల్ల జెండాలు ఎగరేసరని చెప్పారు.