తెలంగాణ ముఖ్యాంశాలు

TS Covid-19 Cases | తెలంగాణలో కొత్తగా 315 కరోనా కేసులు

రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 315 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,60,786కు పెరిగింది. తాజాగా 340 మంది డిశ్చార్జి అవగా.. ఇప్పటి వరకు 6,51,425 మంది బాధితులు కోలుకున్నారు. మరో ఇద్దరు వైరస్‌ బారినపడి మృతి చెందగా.. మృతుల సంఖ్య 3,891కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 5,490 యాక్టివ్‌ కేసులున్నాయి. రికవరీ రేటు 98.58శాతం, మరణాల రేటు 0.58 శాతం ఉందని వైద్య, ఆరోగ్యశాఖ గురువారం తెలిపింది. ఇవాళ ఒకే రోజు 75,199 కొవిడ్‌ శాంపిల్స్‌ పరీక్షించినట్లు పేర్కొంది. తాజాగా నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీలో 83, హనుమకొండలో 21, నల్లగొండలో 21, కరీంనగర్‌లో 20 మందికి వైరస్‌ పాజిటివ్‌గా తేలింది.