ఐరాస ఓటింగ్‌కు దూరంగా భారత్
ఉక్రెయిన్‌పై యుద్ధం కొనసాగిస్తున్న రష్యాకు మరో గట్టి ఎదరు దెబ్బ తగిలింది. ఐక్యరాజ్య సమితి గొడుగు కింద పనిచేస్తున్న మానవ హక్కుల మండలి (హ్యూమన్ రైట్స్ కౌన్సిల్) నుంచి రష్యా బహిష్కరణకు గురైంది. ఈ మేరకు ఐరాస సర్వ ప్రతినిధుల సభ (జనరల్ అసెంబ్లీ) కీలక నిర్ణయం తీసుకుంది. జనరల్ అసెంబ్లీలో ఓటింగ్ నిర్వహించిన ఐరాస.. సభ్య దేశాల ఓటింగ్ మెజారిటీకి అనుగుణంగా రష్యాను మానవ హక్కుల మండలి నుంచి బహిష్కరించింది.
అయితే, ఈ ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉండిపోయింది. ఈ ఓటింగ్‌లో పాల్గొనకుండా భారత్ తన తటస్థ వైఖరిని అవలంబించింది. రష్యాను మానవ హక్కుల మండలి నుంచి బహిష్కరించాలన్న తీర్మానంపై ఐరాస జనరల్ అసెంబ్లీలో జరిగిన ఓటింగ్‌లో అనుకూలంగా 93 దేశాలు ఓటేశాయి. ఈ తీర్మానానికి వ్యతిరేకంగా 24 దేశాలు ఓటేయగా… భారత్ సహా 58 దేశాలు ఈ ఓటింగ్‌లో పాలుపంచుకోలేదు.