రోడ్డు ప్రమాదాలు ప్రజలను వణికిస్తున్నాయి. ఇంట్లో నుండి బయటకు వెళ్లినవారు తిరిగి ఇంటికి వచ్చేవరకు నమ్మకం లేదు. ఏ వైపు నుండి ఏ మృతువు వస్తుందో అని భయపడుతున్నారు. అతివేగం , నిర్లక్ష్యపు డ్రైవింగ్ , మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం వంటి పలు వాటితో నిత్యం రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా శనివారం తెల్లవారు జామున నల్గొండ జిల్లా మిర్యాలగూడ హనుమాన్‌పేట బైపాస్ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్ నుంచి బాపట్ల వెళ్తున్న ఆరెంజ్ ట్రావెల్ బస్సు అదుపు తప్పి బోల్తా పడగా… 20 మందికి స్వల్ప గాయాలయ్యాయి. ఘటన తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని గాయపడ్డపడ్డ వారిని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. డ్రైవరు నిద్ర మత్తు కారణంగానే బస్సు అదుపుతప్పి ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. ఘటన జరిగిన సమయంలో బస్సులో 34 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిపారు.