ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు

ఈరోజు వైసీపీ సీనియర్ నేతలకు పదవుల అప్పగింత

పార్టీ లోని సీనియర్ నేతలకు సీఎం జగన్ సంస్థాగత పదవుల పంపకాలు చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఈరోజు సీఎం జగన్ విశాఖ పర్యటన ముగించుకొని రాగానే ఈ పదవుల పంపకాలు చేయనున్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు విజయసాయిరెడ్డి ఇప్పటివరకూ ఉత్తరాంధ్రలో పార్టీని పర్యవేక్షిస్తుండగా.. ఆ బాధ్యత నుంచి తప్పించి పార్టీ కేంద్ర కార్యాలయానికి మారుస్తారని, అలాగే మంత్రి బొత్సకు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల బాధ్యతలను అప్పగించనున్నారని సమాచారం.

ఇక తూర్పుగోదావరికి వైవీ సుబ్బారెడ్డి, పశ్చిమగోదావరికి మిథున్‌రెడ్డి, కృష్ణా, గుంటూరు జిల్లాలకు కొడాలి నాని, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, కర్నూలు, కడప జిల్లాలకు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిలను బాధ్యులుగా నియమించే అవకాశం ఉందని సమాచారం. చిత్తూరు, అనంతపురం జిల్లాలకు మంత్రి పెద్దిరెడ్డికి బాధ్యతలు అప్పగించున్నారు. దీనిపై అధికారిక ప్రకటన ఈరోజు సాయంత్రం వెలువడనుంది.