చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి…
చంద్రబాబుది అక్రమ అరెస్టు అన్నది జగమెరిగిన సత్యం…
అధర్మానిది తాత్కాలిక విజయం…అంతిమంగా ధర్మమే గెలుస్తుంది…
- టీడీపీ నేతలు….
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జైలు నుండి కడిగిన ముత్యంలా విడుదల కావాలని నెల్లూరు నగరంలోని రంగనాయకుల పేటలో గల తల్పగిరి రంగనాధ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి టెంకాయలు కొట్టిన మాజీ మంత్రి పొంగూరు నారాయణ, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, టిడిపి జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్ది తదితరులు.
ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ…
చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ, ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయని అన్నారు. ఈరోజు కోర్టులో వేసిన పిటీషన్ల విషయంలో చంద్రబాబు కు న్యాయం జరగాలని రంగనాథ స్వామి దేవాలయంలో కోరుకున్నట్లుగా ఆయన తెలిపారు.
చంద్రబాబు కడిగిన ముత్యం లా బయటకు వస్తారని ఆశిస్తున్నామని, దాని కోసం ప్రతి ఒక్కరూ ప్రార్థనలు చేయాలని కోరారు.
టిడిపి జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ..
చంద్రబాబుది అక్రమ అరెస్ట్ అన్నది జగమెరిగిన సత్యమని. దానిని యావత్ దేశం వ్యతిరేకస్తుందని అన్నారు. క్వాష్ పిటిషన్, బెయిల్ పిటిషన్ ల పై నేడు విచారణ జరుగుతుందని, న్యాయ స్థానల పై తమకు నమ్మకం ఉందని అన్నారు.
అధర్మం యొక్క విజయం తత్కాలికమైనని, వాటిని చూసి వైసిపి నాయకులు పిశాచిక ఆనందం పొందొచ్చని అంతిమంగా ధర్మమే గెలుస్తుందని అన్నారు. దేవాలయాలపై దైవత్వం పై నమ్మకం ఉందని ప్రత్యేక పూజలు చేశామని తెలిపారు.
రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ…
చంద్రబాబు అక్రమ అరెస్టు, జైల్లో వసతుల కల్పనలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, పల్లెలు పట్టణాలు మండలాలు జిల్లాలు రాష్ట్రాలు దేశాలు అన్న తేడా లేకుండా గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు వంద దేశాల్లో ఉన్న కోట్లాది తెలుగు ప్రజలు బయటకు వచ్చి నిరసనలు తెలిపారని అన్నారు.
ఆంధ్ర రాష్ట్రంలో నిర్బంధాలను అక్రమ కేసులను, లాఠీలను, తూటాలను ఎదుర్కొంటూ జనసేన కమ్యూనిస్ట్ పార్టీలు టీడీపీ తో కలిసి చంద్రబాబు కు అండగా నిలుస్తున్నాయని అన్నారు..
టిడిపి జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ నాయకత్వంలో ప్రార్థన మందిరాల్లో ప్రార్ధనలు నిర్వహిస్తున్నామని, అరాచకానిది అధర్మానిది తాత్కాలిక విజయమేనని ధర్మాన్నిదే తుది విజయమని అన్నారు….
కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు కురుగుండ్ల రామక్రిష్ణ, పాసిం సునీల్ కుమార్, కొమ్మి లక్ష్మి నాయుడు, కావలి నియోజకవర్గ ఇంఛార్జి మాలెపాటి సుబ్బానాయుడు, మాజీ మంత్రి తాళ్లపాక రమేష్ రెడ్డి, నెల్లూరు పార్లమెంట్ టిడిపి ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి, టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి, టిడిపి రాష్ట్ర కార్యదర్శులు జెన్నీ రమణయ్య, రాజా నాయుడు, నగర పార్టీ అధ్యక్షులు మామిడాల మధు తదితరులు పాల్గొన్నారు.