తెలంగాణ ముఖ్యాంశాలు

సీఎం కేసీఆర్ కు సవాల్ విసిరిన ఈటెల..

హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్..ముఖ్యమంత్రి కేసీఆర్ కు సవాల్ విసిరారు. హుజూరాబాద్ ఎన్నికల తరువాత కేసీఆర్ మతి తప్పిందని.. హుజూరాబాద్ లో ధర్మం గెలిచిందని , హుజూరాబాద్ లో ప్రజాస్వామ్యం,తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం గెలిచిందని ఈటెల అన్నారు. నేను సవాల్ విసురుతున్నా…ఎక్క డైనా చర్చకు సిద్ధం..వస్తారా కేసీఆర్..? రైతబంధు ఇచ్చేది పంటలు వేయమానా ?..వేయద్దానా సమాధానం చెప్పగలవా ..? వేలాది మంది రైతులు చనిపోతున్నారు..ఈ పరిస్థితి ఎక్కడ లేదు..కేవలం తెలంగాణ లోనే ఉంది.. సమధానం చెప్తారా..? అని ప్రశ్నించారు.

రైతుల కన్నీళ్ళకు కేసీఆర్ ప్రభుత్వం బస్మీళ్ళు అవుతుంది.. ఆకలి కేకలు లేని ,ఆత్మహత్యలు లేని తెలంగాణ వస్తాదనీ చెప్పినా కేసీఆర్….కేసీఆర్ వచ్చినా తరువాత నీళ్ళు రాని మాట సత్యం కాదా ? అని అగ్రహించారు. వరి కొనమన్నందుకు నీళ్లున్నా 20లక్షల ఎకరాల్లో రైతులు పంటలు వేయలేదని ఈటెల వాపోయారు. రాబోయే కాలంలో టీఆర్ఎస్ పార్టీ పాతరయేపడుతుంది కాబట్టి కేటీఆర్ అలా మాట్లాడుతూన్నాడని మండిపడ్డారు. రానున్న రోజులలో గెలిచే పార్టీ బీజేపీ అని.. అడ్డుకునే శక్తి కేసీఆర్ కు, కేసీఆర్ జేజేమ్మకు లేదన్నారు ఈటెల.