తెలంగాణ ముఖ్యాంశాలు

అర్హులైన వారికి డ‌బుల్ బెడ్రూం ఇండ్లు, నెక్లెస్ రోడ్డులో 26న డ‌బుల్ బెడ్రూం ఇండ్లు ప్రారంభం..మంత్రి త‌ల‌సాని

న‌గ‌రంలోని నెక్లెస్‌రోడ్డు అంబేడ్క‌ర్ న‌గ‌ర్‌లో నిర్మించిన 330 డ‌బుల్ బెడ్రూం ఇండ్లను మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ గురువారం ప‌రిశీలించారు. ఈ నెల 26వ తేదీన ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా డ‌బుల్ బెడ్రూం ఇండ్ల‌ను ప్రారంభిస్తామ‌ని మంత్రి త‌ల‌సాని పేర్కొన్నారు. అర్హులైన వారికి డ‌బుల్ బెడ్రూం ఇండ్లు కేటాయిస్తామ‌ని తెలిపారు. సీఎం కేసీఆర్ ప‌రిపాల‌నలో ప్ర‌తి ఒక్క‌రికి అభివృద్ధి, సంక్షేమ ఫ‌లాలు అందుతున్నాయ‌ని పేర్కొన్నారు.