తెలంగాణ ముఖ్యాంశాలు

ప్రతి గ్రామంలో ‘‘తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణం’’ ఏర్పాటు చేయాలని సీఎం కేసిఆర్ నిర్ణయం

పల్లెల్లోని యువతకు తీపి కబురు తెలిపారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రతి గ్రామంలో ‘‘తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణం’’ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 19వేల గ్రామాలు, 5 వేల వార్డులు, మొత్తంగా 24 వేల ‘‘గ్రామీణ క్రీడా కమీటీల’’ను ఏర్పాటు ఆదేశించారు. జూన్ 2 రాష్ట్ర అవిర్భావ దినోత్సవం నాడు ఎంపిక చేసిన కొన్ని గ్రామల్లొ క్రీడా ప్రాంగణాలను ప్రారంభించాలన్నారు.

ఇక ఈ నెల 20 నుంచి ప్రారంభించాల‌నుకున్న ప‌ల్లె, ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మాల‌ను వాయిదా వేయాల‌ని మంత్రులు, అధికారులు సీఎం కేసీఆర్‌ను కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్ర‌త‌లు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప‌ల్లె, ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మాల‌ను వాయిదా వేయాలని కోరగా.. వారి విజ్ఞ‌ప్తి ప‌ట్ల సానుకూలంగా స్పందించిన కేసీఆర్.. జూన్ 3 నుంచి ప‌ల్లె, ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మాల‌ను ప్రారంభించాల‌ని సూచించారు. జూన్ 3 నుంచి 15 రోజుల పాటు ఈ కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించాల‌ని సీఎం కేసీఆర్ నిర్ణ‌యించారు.