తెలంగాణ ముఖ్యాంశాలు

నేడు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న మంత్రి తలసాని

సనత్‌నగర్ నియోజకవర్గంలోని బన్సీలాల్ పేట డివిజన్‌లో పశుసంవర్థక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం రూ. కోటి 50 లక్షల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. బన్సీలాల్‌పేట కమాన్ నుంచి మల్టీపర్పస్ ఫంక్షన్హాల్ వరకు చేపట్టనున్న ఫుట్‌పాత్, టేబుల్డ్రైన్ నిర్మాణ పనులను ఆయన ప్రారంభించనున్నారు. జయప్రకాష్ నగర్‌లో సీవరేజ్ పైపులైన్‌, సీసీనగర్లో సీవరేజ్ లైన్ రీ మోడలింగ్ పనులతోపాటు మేకలమండి నుంచి గొల్ల కొమరయ్య కమ్యూనిటీ హాల్ వరకు చేపట్టనున్న సీవరేజ్ లైన్ రీమోడలింగ్ నిర్మాణ పనులను ఆయన ఆరంభించనున్నారు. అదేవిధంగా గాంధీనగర్, మేకలమండి ప్రాంతాల్లో చేపట్టనున్న తాగునీటి పైపులైన్ పనులతోపాటు మేకలమండి నుంచి కవాడిగూడ మెయిన్ రోడ్ వరకు చేపట్టనున్న సీవరేజ్ లైన్, జయనగర్‌లో కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులను మంత్రి తలసాని ప్రారంభిస్తారు.