చెట్టును ఢీకొన్న వాహనం
కర్నాటకలోని ధార్వాడ్‌లో ఘోర రోడ్డుప్రమాదంలో చోటుచేసుకుంది.ఓ వాహనం చెట్టును ఢీకొన్న ఘటనలో ఏడుమంది మృతిచెందారు.ఆ మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. ఈ ప్రమాదం నిగాది గ్రామం వద్ద జరిగినట్లు పోలీసులు తెలిపారు. మల్లీ యుటిలిటీ వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొన్నట్లు ఎస్పీ కృష్ణకాంత్ తెలిపారు.
ఎంయూవీలో ఉన్నవారంతా బెనకానాకట్టి గ్రామస్తులని చెప్పారు. మే 20వ తేదీన మన్సూర్ గ్రామంలో జరిగిన ఫ్యామిలీ ఫంక్షన్‌లో పాల్గొన్న తర్వాత తిరిగివస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. నలుగురు వ్యక్తులు అక్కడిక్కడే ప్రాణాలు విడువగా, మరో ముగ్గురు హాస్పిటల్ వద్ద కన్నుమూశారు. హుబ్లీ కిమ్స్ ఆస్పిటల్‌లో గాయపడ్డవారిని చేర్పించారు. ధార్వాడ్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదంలో మరో 10 మంది గాయపడ్డారు. ఆ వాహనంలో 21 మంది ఉన్నట్లు తెలుస్తోంది.