తెలంగాణ ముఖ్యాంశాలు

ఈ నెల‌ 22న వాసాల‌మ‌ర్రికి సీఎం కేసీఆర్

ఈ నెల 22వ తేదీన యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలోని వాసాల‌మ‌ర్రికి సీఎం కేసీఆర్ వెళ్ల‌నున్నారు. సీఎం కేసీఆర్ ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో జిల్లా క‌లెక్ట‌ర్ ప‌మేలా స‌త్ప‌తి ఏర్పాట్లను ప‌రిశీలించారు. వాసాల‌మ‌ర్రి గ్రామాన్ని సీఎం కేసీఆర్ ద‌త్త‌త తీసుకున్న విష‌యం తెలిసిందే. గ‌తేడాది న‌వంబ‌ర్ నెల‌లో జనగామ జిల్లా కొడకండ్లలో పర్యటన ముగించుకుని తిరుగు పయనమైన సీఎం కేసీఆర్ వాసాలమర్రిలో ఆగి, గ్రామాభివృద్ధిపై స్థానికుల‌తో చ‌ర్చించిన సంగ‌తి తెలిసిందే.